
కామారెడ్డిటౌన్, వెలుగు: ఈ నెల 27న జరిగే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఫస్ట్ విడత ట్రైనింగ్నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలక్షన్ నిర్వహణ కోసం నియమితులైన అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్నిర్వహించాలన్నారు. సీపీవో రాజరాం, ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, పాల్గొన్నారు. ట్రైనింగ్ గురించి మాస్టర్ట్రైనర్స్ రామకృష్ణ, లక్ష్మణ్ వివరించారు.