![ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ashish-sangwan-conducted-training-for-returning-officers-regarding-panchayat-elections-at-collectorate_vzTn13asOF.jpg)
కామారెడ్డి టౌన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ( స్టేజీ-1) అధికారులకు ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొరపాటు, లోపాలకు తావులేకుండా ఎన్నికల విధుల్ని నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ టైంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సమస్యలు, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్విక్టర్, డీపీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రెడీగా ఉండాలి..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్లరేట్ లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలట్బాక్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. మండలస్థాయిలో ఈనెల 14, 15 తేదీల్లో ప్రిసైడింగ్‌అధికారులు, పోలింగ్ అధికారుల నియమాకం కోసం ఫస్ట్ ర్యాండమైజేషన్ ప్రక్రియ కంప్లీట్చేయాలన్నారు. ఎన్నికల మెటీరియల్ రెడీ చేసుకోవాలన్నారు. అనంతరం పోలికల్పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.