కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణిలో స్వీకరించే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి 69 ఫిర్యాదులు అందాయి. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు , ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
సర్వే పక్కగా చేపట్టాలి
సమగ్ర సర్వే పక్కగా చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముస్రాంబాగ్లో సర్వేను కలెక్టర్ పరిశీలించారు.సర్వేలో తప్పులు లేకుండా పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రతీ ఎన్యుమరేటర్ రోజుకు 15 నుంచి 20 ఇండ్లలో సమాచారం సేకరించాలన్నారు. సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు ఎన్యుమరేటర్లకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఆర్డీవో రంగనాథ్‌రావు, తహసీల్దార్జనార్ధన్, మున్సిపల్ఇన్చార్జి కమిషనర్వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, ఇన్చార్జి డీపీఓ శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ కు వివరించి అర్జీలు సమర్పించారు.