
కామారెడ్డి టౌన్, వెలుగు : లబ్ధిదారుల జాబితాలోని వారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రెడీగా ఉన్న వారికి వెంటనే మార్కవుట్ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆయా శాఖల అధికారులతో రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు బెస్మిట్ వరకు నిర్మాణాలు త్వరగా జరిగేలా చూడాలన్నారు.
నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు యాప్‌లో ఎంట్రీ చేయాలన్నారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ సెంటర్ తనిఖీ ..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలోని జడ్పీ హైస్కూల్లో ఎస్సెస్సీ ఎగ్జామ్ సెంటర్‌ను బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాపీయింగ్‌కు పాల్పడకుండా పటిష్ట నిఘా ఉండాలని అధికారులకు సూచించారు.