భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ 

భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ 

కామారెడ్డి, వెలుగు : పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ భారతి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో రెవెన్యూ, ఫారెస్ట్​ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడారు.

 భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.  రెవెన్యూ, ఫారెస్ట్​ అధికారులు సంయుక్తంగా సర్వే చేయనున్నట్లు తెలిపారు. సమీక్షలో డీఎఫ్​వో నిఖిత, జిల్లా అడిషనల్ కలెక్టర్​ వి.విక్టర్,  ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్,  ఫారెస్టు ఆఫీసర్ రామకృష్ణ, తహసీల్దార్ సురేష్ తదితరులు  పాల్గొన్నారు.