పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా చేయాలి

పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా చేయాలి

భిక్కనూరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు. మంగళవారం ఆయన  భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో రాజ్​కిరణ్​రెడ్డి, ఎంఆర్వో శివప్రసాద్ తదితర ఆఫీసర్లతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా అసలైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని సూచించారు. 

సదాశివనగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పక్కగా నిర్వహించాలని జడ్పీ సీఈవో( మండల ప్రత్యేక అధికారి) చందర్​ నాయక్​ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సదాశివనగర్​ మండలంలోని మర్కల్​ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తున్న ఇందిరమ్మ సర్వే తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కార్యదర్శులు తప్పులు లేకుండా  నిర్వహించాలన్నారు. అర్హుల వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్​ కుమార్​, ఎంపీవో సురేందర్​ రెడ్డి, సిబ్బంది  పాల్గొన్నారు. 

సర్వే సజావుగా నిర్వహించాలి

బోధన్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఫాన్​గల్లి, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.  రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు?   క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుదారుల వివరాలను మొబైల్ యాప్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.

 నెలాఖరులోగా వంద శాతం సర్వే పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న వారు వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి వివరాలను  సర్వే యాప్ లో పొందుపర్చాలని అన్నారు.  ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని  వార్డు అధికారిని, గ్రామాల్లో ఉండే వారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చన్నారు.  కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ,  తహసీల్దార్​​ విఠల్​ ఉన్నారు.