
కామారెడ్డిటౌన్, వెలుగు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు 48 సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు థియరీ పరీక్షలు జరుగుతామన్నారు. పరీక్షల సమయంలో కరెంట్ సప్లయ్‌లో అంతరాయం లేకుండా చూడాలన్నారు.
గ్రామాల నుంచి స్టూడెంట్స్ సకాలంలో వచ్చేలా బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్వి. విక్టర్, ఇంటర్నోడల్అధికారి షేక్‌సలాం, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఈవో రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంబురంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ వార్షికోత్సవం
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వార్షికోత్సవ ప్రోగ్రాంకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా సాగాలన్నారు.
జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఆన్లైన్ ద్వారా అనుభవజ్ఞులైన లెక్చరర్లతో కోచింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్ నోడల్ అధికారి షేక్‌సలాం, కాలేజీ ప్రిన్సిపాల్జయకుమారి, దాతలు డాక్టర్ జి. రవీందర్‌రెడ్డి, డాక్టర్ అర్వింద్, డాక్టర్ కృప, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు అందజేశారు.