
కామారెడ్డి, వెలుగు : గాంధారి మండలం పేట్‌సంగెం హైస్కూల్ ను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను బోర్డుపై రాసి, విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు.
ప్రత్యేక క్లాసులను నిర్వహించిన విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. టెన్త్ తర్వాత ట్రిపుల్ ఐటీలో చేరేలా చదువుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు. అనంతరం పేట్‌సంగెం రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, స్పెషల్ఆఫీసర్ లక్ష్మీప్రసన్న తదితరులు ఉన్నారు.