ఎల్ఆర్ఎస్​ స్పీడప్ చేయాలి : ​ ఆశిష్​ సంగ్వాన్

ఎల్ఆర్ఎస్​ స్పీడప్ చేయాలి : ​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఎల్ఆర్ఎస్ పక్రియను మరింత స్పీడప్​ చేయాలని  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలో  ఎల్ఆర్ఎస్​ పక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రెగ్యులరైజేషన్​ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లూ స్పీడప్ న్నాచేయాలని అన్నారు. అప్లయ్​ చేసుకున్న వాళ్లకు ఫోన్​ చేసి 25 శాతం రిబేట్​ ఉపయోగించుకునేలా అవేర్​నెస్ తేవాలన్నారు.   కమిషనర్​ రాజేందర్​రెడ్డి,  టీపీవో గిరిధర్,  డీఈ వేణుగోపాల్  ఉన్నారు.