సారంగాపూర్ మండలంలో రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

నిర్మల్/మంచిర్యాల, వెలుగు : ఈ నెల 31లోగా రైస్ మిల్లుల యాజమాన్యాలు సీఎంఆర్ టార్గెట్ ను పూర్తి చేయాలని నిర్మల్​కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సారంగాపూర్ మండలం స్వర్ణలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి, మిల్లింగ్ ను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా సీఎంఆర్​ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కల్యాణి, డీఎం శ్రీకళ తదితరులున్నారు. మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లర్లకు కేటాయించిన సీఎమ్మార్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.

అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా సివిల్ సప్లయ్​ ఆఫీసర్ వాజిద్, జిల్లా మేనేజర్ గోపాల్​తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2022-–23 వానాకాలానికి సంబంధించిన సీఎమ్మార్ టార్గెట్​ను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రబీలో 45 వేల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్ లో 34 వేల మెట్రిక్ టన్నుల ధ్యాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ పెండింగ్ ఉందని, త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సకాలంలో సీఎమ్మార్ పూర్తిచేయని మిల్లులపై చర్యలు తీసుకొని, సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.