స్టూడెంట్స్ ను జాగ్రత్తగా చూసుకోవాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

స్టూడెంట్స్ ను జాగ్రత్తగా చూసుకోవాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
  • ప్రతి స్కూల్​లో చైల్డ్ ప్రొటెక్షన్​ అధికారి నియామకం 

కామారెడ్డిటౌన్, వెలుగు: స్టూడెంట్స్ పై  లైంగిక దాడులు జరగకుండా చూడాలని చైల్డ్ ప్రొటెక్షన్​అధికారులకు కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​సూచించారు.  ప్రతి స్కూల్‌‌‌‌లో చైల్డ్‌‌‌‌ ప్రొటెక్షన్ అధికారిని నియమించామన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో  స్కూల్స్‌‌‌‌లో చైల్డ్ ప్రొటెక్షన్​అధికారి, హెచ్‌‌‌‌ఎంలకు ఓరియేంటేషన్​ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్స్‌‌‌‌లో యూనిసెఫ్ ద్వారా అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ ప్రోగ్రాం నిర్వహించామన్నారు. ఐసీడీఎస్​జిల్లా అధికారి ప్రమీల, యూనిసెఫ్​ రిసోర్స్​ పర్సన్​  డేవిడ్​రాజ్​ ,  సీడబ్లూసీ మెంబర్​ స్వర్ణగత తదితరులు పాల్గొన్నారు. 

పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

కామారెడ్డిటౌన్, వెలుగు:  కామారెడ్డి టౌన్‌‌‌‌లోని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పంచముఖి హన్మాన్​కాలనీలో ఉన్న పార్క్​ను కలెక్టర్​ పరిశీలించారు. పార్కుల అభివృద్ధికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, సీనియర్​సిటిజన్స్ సహకారం తీసుకోవాలన్నారు. పార్కులను అభివృద్ధి చేయాలన్నారు.   అనంతరం కళాభారతి ఆడిటోరియం ముందు ఉన్న చెట్లకు కలెక్టర్ నీళ్లు పట్టారు.  ప్రతి శుక్రవారం వాటరింగ్​ డే తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మున్సిపల్​ కమిషనర్​ రాజేందర్ రెడ్డి, డీఈ వేణుగోపాల్​, ఏఈ శంకర్​ ఉన్నారు.