అక్రమ ఇసుక రవాణాపై నిఘా : ఆశిష్ సంగ్వాన్​

అక్రమ ఇసుక రవాణాపై నిఘా : ఆశిష్ సంగ్వాన్​
  •  కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్​, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాకు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాండ్ (ఇసుక) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పాయింట్లు,  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 

మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.  మిషన్ భగీరథ నీటి సరఫరాకు పైప్ లైన్లు, ట్యాంకులు, సంపులను నిర్మించాలన్నారు.  సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, అడిషనల్​ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీవోలు ప్రభాకర్, వీణ, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, మైనింగ్ సహాయ సంచాలకులు పి.నగేశ్ పాల్గొన్నారు.

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ.. 

జిల్లా సమగ్ర శిక్ష, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని ప్రారంభించి, 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.   తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. 2014 లో దివ్యాంగ విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్  గా నిలిచారని గుర్తు చేశారు.  కార్యక్రమంలో డీఈవో రాజు, ఆర్డీవో వీణ, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, అలీమ్ కో ప్రతినిధులు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు నాగ వేందర్, కృష్ణ చైతన్య, వేణుగోపాల్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పతి , ఇన్​చార్జి ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.