కామారెడ్డిటౌన్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని స్పీడప్ చేయాలని ఆఫీసర్లను కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ ఆదేశించారు. గురువారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీవో రాజారాం, ఇతర ఆఫీసర్లతో డేటా ఎంట్రీపై రివ్యూ చేశారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలన్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఎక్కువ మంది ఆపరేటర్లను నియమించుకొని ఎంట్రీ స్పీడప్ చేయాలని సూచించారు. సర్వే ఫారాలను భద్రపర్చాలన్నారు.
ట్యాబ్ ఎంట్రీ చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆఫీసర్లతో మాట్లాడుతూ.. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైసు మిల్లులకు తరలించాలన్నారు. ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తేనే వెంటనే అమ్మకం పైసలు రైతుల అకౌంట్లలో జమవుతాయన్నారు. ట్యాబ్ ఎంట్రీలో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.