కామారెడ్డిటౌన్, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో జిల్లా ఎప్పుడూ ముందుంటుందని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. కౌన్సిల్ ఫర్రివల్యూషన్, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ఎర్త్ క్లబ్, యంగ్ఎర్త్ లీడర్స్పోగ్రాంను గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై జిల్లాను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.
స్కూల్స్, గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. డీఈవో రాజు, డీఆర్డీవో సురేందర్, ఫారెస్టు అధికారి రామకృష్ణ, డీఏవో తిరుమల ప్రసాద్, హార్టీకల్చర్జిల్లా అధికారి జ్యోతి, సీజీఆర్ ప్రెసిడెంట్లీలాలక్ష్మారెడ్డి, ప్రతినిధులు సిద్ధిరాంరెడ్డి, వెంకట్రెడ్డి, అన్నమయ్య, తదితరులు పాల్గొన్నారు.