కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మొత్తం 6,90,317 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,33,070 మంది, మహిళలు 3,57,215 మంది, ఇతరులు 32 మంది ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల తుది ఓటర్జాబితాను సోమవారం కలెక్టర్ ఆశిష్సంగ్వాన్విడుదల చేశారు. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 24,145 మంది ఎక్కువగా ఉన్నారు. జుక్కల్ నియోజక వర్గంలో మొత్తం 2,06,402 మంది ఓటర్లు ఉన్నారు.
కాగా ఇందులో పురుష ఓటర్లు 1,01,076 మంది, మహిళా ఓటర్లు 1,05,316 మంది ఉన్నారు. మహిళలు 4,240 మంది ఎక్కువగా ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,25,858 మంది ఓటర్లు ఉండగా, పురుషులు... 1,08, , మహిళలు 1,17,781 ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 9,706 మంది అధికం ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,58,057 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,23,919 మంది, మహిళలు 1,34,118 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 10,199 మంది ఎక్కువగా ఉన్నారు.