మహిళా శక్తి భవన నిర్మాణం పూర్తి చేయాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్

మహిళా శక్తి భవన నిర్మాణం పూర్తి చేయాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు:  ఇందిర మహిళా శక్తి భవనానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు​కేటాయించినట్లు కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్ ​తెలిపారు.  గురువారం   మహిళా శక్తి భవనం కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్​ఆఫీసర్లకు కలెక్టర్​ ఆదేశించారు.  కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్​రావు, డీఆర్​డీవో సురేందర్,  డీసీఎం సుధాకర్​ తదితరులు పాల్గొన్నారు.  

11 మండలాల్లో  వంద శాతం సర్వే 

ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కామారెడ్డి జిల్లాలోని 11 మండలాల్లో  వంద శాతం పూర్తయినట్లు కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ తెలిపారు.  గురువారం  ఆయా మండలాల స్పెషల్​ ఆఫీసర్లు, తహసీల్దారులు,  ఎంపీడీవోలతో కలెక్టర్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.  సర్వే పూర్తి కాని ఏరియాల్లో  రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ తప్పులు లేకుండా  చేయాలని సూచించారు.   ప్రత్యేక ఓటరు నమోదులో వచ్చిన  ఫారాలను తహసీల్దార్​లు వెంటనే పరిశీలన చేయాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్లు శ్రీనివాస్​రెడ్డి, విక్టర్,  ఆర్డీవో రంగనాథ్​రావు, సీపీవో రాజారాం,   ఆఫీసర్లు పాల్గొన్నారు.