కామారెడ్డి, వెలుగు: రైతులు తెచ్చిన పత్తి ని జిన్నింగ్ మిల్లుల్లో వెంటనే కొనుగోలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్‌లో చేపట్టిన పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. తూకం వేసిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, మార్కెటింగ్ జిల్లా అధికారి రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఉండేలా ..
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కగా చేపట్టాలని సిబ్బందిని కలెక్టర్ఆదేశించారు. శుక్రవారం బిచ్కుంద మండలం పత్లాపూర్లో సర్వే తీరును పరిశీలించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు ఉన్నాయో? లేదో? పరిశీలించాలన్నారు. సర్వే చేస్తున్నప్పుడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు హాజరయ్యేలా చూడాలన్నారు. సర్వేపై గ్రామాల్లో ముందుగానే ప్రచారం చేయాలన్నారు. సబ్‌కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో గోపాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ నగేష్ ఉన్నారు. బిచ్కుందలోని ఐటీఐని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.