కామారెడ్డి జిల్లాలో మూడు సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ : కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో మూడు సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ  : కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేడు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్​ కేంద్రాల్లో సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.  మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని డిస్ర్టిబ్యూషన్ సెంటర్​ను కలెక్టర్​ పరిశీలించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో డిస్ర్టిబ్యూషన్ సెంటర్లలో బుధవారం సామగ్రిని పంపిణీ చేస్తామని, ఎన్నికల  సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలన్నారు.  

గ్రాడ్యుయేట్, టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ కోసం 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  గ్రాడ్యుయేట్ ఓటర్లు 16,410 మంది,  టీచర్​ ఓటర్లు  2,011 మంది ఉన్నారని తెలిపారు. కలెక్టర్​ వెంట అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్​రెడ్డి,  ఏవో మసూద్ ఆహ్మద్, తహసీల్దార్​ జనార్దన్ ఉన్నారు.