ప్రతి మండలంలో మోడల్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

ప్రతి మండలంలో మోడల్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో భాగంగా ప్రతి మండలంలో మోడల్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన మీటింగులో కలెక్టర్ మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు కోసం మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోళ్లను ఎప్పటికప్పుడు తహసీల్దార్లు, అధికారులు పరిశీలన చేయాలన్నారు. ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే చేపడతామన్నారు. ఎన్యుమారెటర్లకు మండల స్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, అధికారులు పాల్గొన్నారు. 

వడ్ల కొనుగోలు చేయాలి 

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్  పేర్కొన్నారు.  సోమవారం కామారెడ్డి మండలం గర్గుల్‌‌‌‌‌‌‌‌లో  ఆయన మాట్లాడుతూ... సెంటర్లలో హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు.  వడ్లలో చెత్త లేకుండా చూడాలన్నారు. ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకంలో తేడా రాకుండా చూడాలన్నారు. ఆర్డీవో రంగనాథ్ రావు, డీఎస్ వో నరసింహారావు, మేనేజర్ రాజేందర్, తహసీల్దార్ జనార్ధన్ తదితరులు ఉన్నారు.