కామారెడ్డి టౌన్, వెలుగు: ఈనెల 17,18 తేదీల్లో జరిగే గ్రూప్–3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎగ్జామ్ నిర్వహణపై ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 8,268 మంది ఎగ్జామ్ రాయనున్నారని, ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు.
ఇన్విజిలేటర్లకు ఈనెల 14వ తేదీన ట్రైనింగ్ ఇస్తామన్నారు. పరీక్షకు ముందు, పరీక్ష ముగిసిన తర్వాత తగినన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. కరెంటు సప్లయ్‌లో అంతరాయం ఉండకూదన్నారు. ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతించవద్దన్నారు. అడిషనల్కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, అడిషనల్ఎస్పీ నరసింహరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ విజయ్కుమార్తదితరులు పాల్గొన్నారు.