![కోళ్ల పెంపకందారులు అలర్టుగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ashish-sangwan-says-poultry-farmers-should-be-alert-in-latur_TepD2aW8XP.jpg)
- మహారాష్ట్రలోని నుంచి కోళ్లు రాకుండా చూసుకోవాలి
కామారెడ్డిటౌన్, వెలుగు: మహారాష్ట్రలోని లాతూర్‌లో బర్డ్ ప్లూ ప్రబలినందు వల్ల కోళ్లపెంపకందారులు అలర్టుగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో కోళ్ల పెంపక రైతులు, పశు సంవర్ధక శాఖ సిబ్బందికి కోళ్లలో వచ్చే వ్యాధులపై అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహారాష్ర్ట మన జిల్లాకు సరిహద్దున ఉన్నందున పెంపకందారులు అలర్టుగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
మహారాష్ర్ట నుంచి మన జిల్లాలోకి కోళ్ల రవాణా జరగకుండా సరిహద్దు చెక్ పోస్టులో తనిఖీలు చేపట్టాలన్నారు. వ్యాధి సోకకముందే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ బూస్టర్ వాడాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కె.సంజయ్‌కుమార్, అసిస్టెంట్ డైరెర్టర్లు శ్రీనివాస్, భాస్కరన్, ఆర్. దేవేందర్, వెటర్నరీ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ ట్యాక్స్ 100 శాతం వసూలు చేయాలి
కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ 100 శాతం వసూలు చేయాలని కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో వివిధ ఆంశాలపై రివ్యూ మీటింగ్ జరిగింది. కలెక్టర్మాట్లాడుతూ.. రోజు వారీ వసూళ్ల వివరాలను ప్రతి రోజు సాయంత్రం తనకు అందించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో మొక్కలకు నీరు పోయించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.