
కామారెడ్డి, వెలుగు : జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం 5 ట్యాంకర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ టౌన్లో ఇప్పటికే 8 ట్యాంకర్లతో నీటిని సప్లయ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ. 50 లక్షలతో కొత్తగా కొనుగోలు చేసిన ట్యాంకర్లతో మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో నీటి సప్లయ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
హౌజింగ్ బోర్డు కాలనీ వద్ద మున్సిపల్ బోర్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సప్లయ్‌ను పరిశీలించారు. రూ. 40 లక్షలతో కొనుగోలు చేసిన జేసీబీకి కలెక్టర్ పూజ చేశారు. అనంతరం ఎల్ఆర్ఎస్ పక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌజింగ్ పీడీ విజయల్ పాల్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.