కామారెడ్డి కలెక్టరేట్​లో ఫెసిలిటేషన్​ కేంద్రం ఏర్పాటు

కామారెడ్డి కలెక్టరేట్​లో ఫెసిలిటేషన్​ కేంద్రం ఏర్పాటు

కామారెడ్డిటౌన్​, వెలుగు : గ్రాడ్యుయేట్, టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ లో ఫెసిలిటేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  సోమవారం కలెక్టర్​ కేంద్రాన్ని పరిశీలించారు.  పోస్టల్​ బ్యాలెట్​ వినియోగించుకునేందుకు  ఈ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్,  శ్రీనివాస్​రెడ్డిలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.  

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి 

కామారెడ్డి టౌన్​, వెలుగు : పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి, జిల్లా మొదటి స్థానంలో నిలుపాలని  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్​లో ఎంఈవోలు, హైస్కూల్ హెచ్​ఎంలు,  మోడల్​ స్కూల్స్​, కేజీవీబీ, రెసిడెన్షియల్ స్కూల్స్​ ప్రిన్సిపాల్స్​లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.  సమావేశంలో డీఈవో రాజు, ఎగ్జామ్స్​  అసిస్టెంట్ కమిషనర్ బలరాం,  డీసీఈబీ సెక్రటరీ నీలం లింగం, కో ఆర్డినేటర్లు వేణుగోపాల్, నాగవేందర్,  వెంకటరమణారావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. 

మెనూను పక్కాగా అమలు పర్చాలి ..

హాస్టల్స్​, రెసిడెన్షియల్ స్కూల్స్​లో ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన డైట్ మెనూను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్​లో ఫుడ్ సేఫ్టీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు.  పప్పులు, ఇతర ఆహార పదార్థాలు కాంట్రాక్టర్లు నాణ్యమైనవి సప్లయ్​ చేసేలా చూడాలన్నారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు  విక్టర్​,  శ్రీనివాస్​రెడ్డి,  ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు  రజిత,  స్రవంతి, దయానంద్, ఫుడ్​ సేప్టీ అధికారి శిరిష పాల్గొన్నారు.