
కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రతి మండల కేంద్రంలో మాడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలానికి ఇద్దరి చొప్పున మేస్ర్తీలకు శిక్షణ ఇవ్వాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇతర సామగ్రిని సమకూర్చాలన్నారు. ఇటుకల తయారీ కోసం స్వయం సహాయక సంఘాలను గుర్తించి యూనిట్లు మంజూరు చేయాలన్నారు. ఇండ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నవారికి పర్మిషన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జడ్పీ సీఈవో చందర్, హౌసింగ్ ఈఈ విజయపాల్‌రెడ్డి, డీఆర్డీవో సురేందర్, అధికారులు పాల్గొన్నారు.
సదరం క్యాంపులకు సిద్ధం కండి..
సదరం క్యాంపులన నిర్వహించేందకు అవసరమైన సామగ్రి కోసం నివేదిక తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో అధికారులతో ఆయన మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రడ్డి, డీఆర్డీవో సురేందర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదాబేగం, డీసీహెచ్‌వో విజయలక్ష్మి
పాల్గొన్నారు.