కామారెడ్డి, వెలుగు: ఆర్గానిక్పంటలకు మంచి డిమాండ్ఉందని, ఈ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కామారెడ్డి కలెక్టర్ఆశిష్సంగ్వాన్సూచించారు. రైతు భరోసా ప్రోగ్రాంను పటిష్టం చేయడానికి మంగళవారం రైతు నేస్తంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీసీలో జిల్లా నుంచి కలెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి వారికి పలు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. మహిళ రైతులు ముందుకొచ్చి పంటల సాగు చేపట్టాలన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మీ, ఏడీఏ వీరాస్వామి ఆఫీసర్లు పాల్గొన్నారు.