విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం,  మంచి విద్యా బోధన అందించాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు.  బుధవారం కామారెడ్డి మున్సిపల్​ పరిధిలోని సరంపల్లి గిరిజన రెసిడెన్సియల్​ స్కూల్, కాలేజీని సందర్శించారు.  స్కూల్, కాలేజీ  సమీపంలో  నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.  పైపులైన్​ లీకేజీలకు రిపేర్​చేయించాలన్నారు.  స్టోర్​ రూమ్​లో నిత్యావసర వస్తువులు, స్టాక్​ రిజిస్టర్లను పరిశీలించారు.  

అనంతరం ఆయన మాట్లాడుతూ పేరెంట్స్​ కమిటీ మీటింగ్​లు నిర్వహించాలని,  టెన్త్​, ఇంటర్​స్టూడెంట్స్​పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్పెషల్​ క్లాస్​లు నిర్వహించాలన్నారు.  విద్యార్థులతో కలిసి కలెక్టర్ , ఆఫీసర్లు భోజనం చేశారు.  కలెక్టర్​వెంట మండల స్పెషల్​ఆఫీసర్​ తిరుమల ప్రసాద్​, జిల్లా ట్రైబల్​వెల్పేర్​ఆఫీసర్ రజిత,  ప్రిన్సిపాల్​అమర్​సింగ్​,  పుడ్​ సేఫ్టీ ఆఫీసర్​శిరీష తదితరులు ఉన్నారు.

మాతా, శిశు మరణాలను  అరికట్టాలి

కామారెడ్డి టౌన్, వెలుగు: మాతా శిశు మరణాలను అరికట్టేందుకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్​​ సంగ్వాన్​ ఆదేశించారు. బుధవారం  కలెక్టరేట్లో  ఆఫీసర్లతో మాతాశిశు మరణాలపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.   మాతాశిశు మరణాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు అందజేయాలన్నారు. ప్రజలకు ఐసీడీఎస్ సూపర్​వైజర్లు, ఏఎన్​ఎంలు, మల్టీ లెవల్​హెల్త్  ప్రొవైడర్లు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో చంద్రశేఖర్, డీసీహెచ్​వో విజయలక్ష్మీ, మెడకిల్ సూపరింటెండెంట్​ఫరీదా, ఆఫీసర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.