![పరీక్షల్లో టెన్షన్ పడొద్దు : ఆశిష్ సంగ్వాన్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ashish-sangwan-visits-residential-school-and-inspects-evm-godown_YvnPyLHzKV.jpg)
- రెసిడెన్సియల్ స్కూల్‌ను విజిట్ చేసిన కలెక్టర్
కామారెడ్డి, వెలుగు: పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని ధైర్యంగా ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలోని సోషల్వెల్ఫేర్రెసిడెన్సియల్ స్కూల్, జూనియర్ కాలేజీని కలెక్టర్విజిట్చేశారు. కిచెన్ రూమ్, స్టోర్రూంతనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్‌కుమార్, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, ప్రిన్సిపాల్శివరాం, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఎంఈవో ఆనంద్‌రావు తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను శుక్రవారం కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. గోడౌన్‌కు వేసిన సీల్స్, గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్‌యూనిట్లు, వీవీ ప్యాట్లను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, తహసీల్దార్ జనార్ధన్, ఎలక్షన్ సూపరిండెంట్లు అనిల్, సరళ తదితరులు ఉన్నారు.