నిజామాబాద్ సిటీ, వెలుగు: పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో చక్రవర్తి తరుణ్ కుమార్ లకు తమ సమస్యలు విన్నవించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేస్తూ, ప్రజావాణి సైట్ లో అప్లోడ్చేయాలని కలెక్టర్సూచించారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి 65 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భూముల సమస్యలకు సంబంధించినవి 27 అర్జీలు ఉన్నాయి. అడిషనల్కలెక్టర్చంద్రమోహన్, డీఆర్డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్ఏవో మసూర్అహ్మద్ఫిర్యాదులు స్వీకరించారు.