నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్ బి. సత్య ప్రసాద్

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్ బి. సత్య ప్రసాద్

మెట్ పల్లి, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు. అవుట్​పేషెంట్ల వివరాలను ఆరా తీశారు. ఓపీ నమోదుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రసూతి వైద్య సేవలు, ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ, జనరల్ వార్డులు, ఎక్స్-రే, స్కానింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ తనిఖీ చేశారు.  రోగులతో మాట్లాడుతూ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్ బిల్డింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. కాగా తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ప్రతి నెలా రూ.14,600 ఇవ్వాల్సి ఉన్నా కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్పందించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్​సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్, సూపరింటెండెంట్ సాజిద్ అహ్మద్,  మున్సిపల్ కమిషనర్ మోహన్, డాక్టర్లు అమరేశ్వర్, రాజేశ్వర్ ఉన్నారు.