జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ డీటెయిల్స్, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూమ్స్‌ను తిరిగి చూశారు. ప్రిన్సిపాల్ ఖాద్రితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట వైస్ ప్రిన్సిపాల్ డా.అర్చన, డా.డేవిడ్ ఆనంద్, డా.కళాశిల్ప, శ్రీనివాస్ ఉన్నారు.