పెద్దాపూర్ గురుకులంలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ బి.సత్యప్రసాద్

పెద్దాపూర్ గురుకులంలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ బి.సత్యప్రసాద్

మెట్ పల్లి, వెలుగు: పెద్దాపూర్ గురుకులంలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ టీచర్లు, సిబ్బందిని హెచ్చరించారు. గురుకులంలో స్టూడెంట్లు వరుసగా అస్వస్థతకు గురువుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్  ప్రాంగణంలో చేపడుతున్న శానిటేషన్​పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 

స్కూల్ ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం తొలగించి గుంతలు పూడ్చాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులున్నా టీచర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీపీవో రఘువరన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాస్క్ ఫోర్స్, రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఫారెస్ట్, రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రివ్యూలో ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి , శ్రీనివాస్, డీఎస్పీలు పాల్గొన్నారు.