నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బియ్యంలో పురుగులు, రాళ్లు ఉంటే తిప్పి పంపాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం తెలకపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకులాన్ని తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌలతులు కల్పించాలని ఆదేశించారు. మోను ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపు కోసం కృషి చేయాలన్నారు. తహసీల్దార్ జాకీర్ అలీ, ప్రిన్సిపాల్ ఆంజనేయులు ఉన్నారు. అనంతరం తెలకపల్లి ఎంపీడీవో ఆఫీస్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు.సమగ్ర సర్వే ఆన్ లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియను ఎంపీడీవో శ్రీనివాసులు కలెక్టర్‌కు వివరించారు.