బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్ పోటీలు ప్రారంభం

బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్ పోటీలు ప్రారంభం

నస్పూర్, వెలుగు : క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాను ముందంజలో ఉంచాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ పోటీలను అడిషనల్ కలెక్టర్ రాహుల్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, ముఖ్య సలహాదారు గాజుల ముఖేశ్ గౌడ్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.