సీజనల్​ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, సీజనల్​ వ్యాధులు రాకుండా  ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని  కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సర్వేయలెన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్ తో కలసి జాతీయ డెంగ్యూ దినోత్సం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రానున్న వర్షాకాలంలో  వ్యాధులను నియంత్రించేందుకు మందస్తు చర్యలు చేపట్టామన్నారు.  

ఆరోగ్య, అంగన్వాడి కార్యకర్తలు, స్వచ్చంద మహిళ ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాధి లక్షణాలను పరిశీలించి,  అనుమానాస్పదంగా ఉంటే వెంటనే  సమీప ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్స్ లహరి, ప్రశాంతి, ఎస్యుఓలు నామ్దేవ్, సత్యనారాయణ, రవీందర్, హెచ్ఈ శ్రీనివాస్   తదితరులు పాల్గొన్నారు.