![పునరావాసం ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-badavath-santosh-said-vatavarlapally-villagers-are-being-evacuated-from-amrabad-tiger-reserve-core-area_WGLdX4otKJ.jpg)
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి వటవర్లపల్లి గ్రామస్తులను తరలిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరలింపునకు ఒప్పుకున్న 671 కుటుంబాలకు పునరావాసాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
671 కుటుంబాల్లో 311 కుటుంబాలు రూ.15 లక్షల పరిహారానికి ఒప్పుకున్నట్లు, మిగిలిన 360 కుటుంబాలకు బాకారం సమీపంలో ఒక్కో కుటుంబానికి 220 గజాల ఇంటి స్థల కేటాయింపు, జీవనోపాధికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వనున్నట్లు తెలిపారు. పునరావాసం కోసం కేటాయించిన ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆఫీసర్లు అమరేందర్, దేవ సహాయం పాల్గొన్నారు.