ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో మీటింగ్ హాలులో ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు వారానికోసారి స్కూళ్లను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  సీతారామారావు, డీఆర్డీవో చిన్న ఓబులేషు పాల్గొన్నారు.

వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. ప్రజావాణి హాల్​లో ఫిర్యాదులను స్వీకరించారు. అడిషనల్​ కలెక్టర్లు సంచిత్​ గంగ్వార్, నగేశ్​ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై రివ్యూ చేశారు.    వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు  చేయాలని ఆదేశించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అడిషనల్  ఎస్పీ తేజావత్​ రామదాసు ‘నషా ముక్త్’ ప్రతిజ్ఞ చేయించారు. 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, అర్జిదారులకు భరోసా కల్పించాలని కలెక్టర్  విజయేందిర బోయి సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్  ఎస్.మోహన్ రావు, అధికారులు పాల్గొన్నారు. 

నారాయణపేట: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, ట్రైనీ కలెక్టర్  గరిమా నరుల, ఆర్డీవో మధు మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.