నస్పూర్/ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో లోక్సభ ఎన్నికలను సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశను పూర్తి చేశమని మంచిర్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్లో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు.
1,131మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,111 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు 2,187మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఆదిలాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులు మొత్తం 4385 మందిని కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 2,240 మంది ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అధికారులు 2145 ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీపీఆర్ఓ తిరుమల, ఏఓ అరవింద్, ఈడీఏం రవీందర్ పాల్గొన్నారు.