నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిలువ నీటిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు కారణమయ్యే దోమలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు.
ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ నరేశ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ పనులు కంప్లీట్ చేయాలి
పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను ఈ నెల15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్న దృష్యా చివరి దశ పనులు కంప్లీట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గౌసియా, అసిస్టెంట్ డైరెక్టర్ గౌస్, ఆర్అండ్ బీ డీఈ రమాదేవి ఉన్నారు.