![సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ సంతోష్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-badawat-santosh-advised-officials-to-expedite-land-acquisition-for-irrigation-projects_HD0mTZ9qEk.jpg)
అధికారులకు సూచించిన కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాలోని తాడూరు, బిజినపల్లి, వెల్దండ, కల్వకుర్తి, తిమ్మాజీపేట, ఊరుకొండ, వంగూరు మండలాల్లో సేకరిస్తున్న భూసేకరణపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీ 29, 30 లకు సంబంధించిన సర్వే పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, భీమా ప్రాజెక్ట్ భూ సేకరణ అధికారి మధుసూదన్ నాయక్, ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.