
వంగూర్, వెలుగు:పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.శనివారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్.రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రేషన్లబ్ధిదారురాలు నాగనోలు లక్ష్మమ్మ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్డుదారులందరూ బియ్యం తీసుకోవాలని సూచించారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సన్న బియ్యం పంపిణీ
కోడేరు, వెలుగు: మండల కేంద్రంతో పాటు నాగులపల్లి, జనుంపల్లి, పసుపుల గ్రామాల్లో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, తహసీల్దార్ విజయ్‌కుమార్ శనివారం సన్న బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీటీ వెంకటేశ్, గిర్దావర్సురేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.