నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ లో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, తహసీల్దార్, ఇంజనీర్లతో రివ్యూ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ కొండారెడ్డిపల్లిలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లు, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ పనులను కంప్లీట్ చేయాలని సూచించారు.