కోడ్​ ఆఫ్​ కండక్ట్​పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా

భూపాలపల్లి అర్బన్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్​లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణ ప్రక్రియపై ప్రెస్​మీట్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఎన్నికల అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిందని ఏప్రిల్ 18  నుంచి ఏప్రిల్ 25  వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన  , ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4 న ఓట్లు లెక్కింపు పక్రియ   జరుగుతుందని అన్నారు.

  ఎన్నికల ప్రవర్తనా ఉల్లంఘన జరిగితే నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చనలని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని అలాగే  కలెక్టరేట్​లో  ఏర్పాటు చేసిన1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు అందించవచ్చని చెప్పారు.  జిల్లాలోని 317 పోలింగ్ కేంద్రాల్లో  ఎన్నికల కమిషన్ ద్వారా అనుమతి పొంది  ఒకే చోట ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో 14 పోలింగ్ కేంద్రాలను మరోచోటుకి తరలించామన్నారు. 3 పోలింగ్ స్టేషన్లకు పేర్లు మార్చినట్టు తెలిపారు.