గేట్లు ఎత్తుతుండ్రు దిగువ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్ , వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తివేయనున్న సందర్భంగా దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలం దరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నా రాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ప్రజలెవరూ నదిలోకి స్నానానికి, ఈత కొట్టేందుకు వెళ్లవొద్దని, పశువులను నదిలోకి తీసుకెళ్లొద్దని సూచించారు.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోందని, దీంతో నాగార్జు నసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యానికి చేరుకుంటుందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థా యి నీటిమట్టం 312.505 టీఎంసీలకు ఇప్ప టివరకు 266,358 టీఎంసీల నీరు చేరిందని పేర్కొన్నారు. ఈనెల 5న ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ఎత్తి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు తెలిపారు.

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల చేయనున్నట్లు పేర్కొ న్నారు. దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.