వడ్ల కొనుగోళ్ల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్ నారాయణరెడ్డి

 వడ్ల కొనుగోళ్ల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్ నారాయణరెడ్డి
  • కలెక్టర్ నారాయణరెడ్డి   

నల్గొండ అర్బన్, వెలుగు : వానాకాలం ధాన్యం కొనగోల్ల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోలులో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే కంట్రోల్​రూమ్​9963407064 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు పనిచేసే విధంగా సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్ వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ఇందిరమ్మ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి

గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ఎల్ఆర్ఎస్, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూగ్రామీణ స్థాయిలో ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల పరిష్కారం బాగున్నప్పటికీ, పట్టణ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు.