నవంబర్ 5 వరకు పంట రుణాలన్నీ పూర్తి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నవంబర్ 5 వరకు పంట రుణాలన్నీ పూర్తి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  నవంబర్ 5 వరకు పంట రుణాలన్నీ నూటికి నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. వార్షిక పంట రుణాల్లో సైతం 50 శాతం లక్ష్యాలను సాధించాలని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగంలోకి వచ్చే గృహనిర్మాణ, విద్య రుణాల గ్రౌండింగ్ లక్ష్యాలను 50 శాతం పూర్తి చేయాలన్నారు. సూక్ష్మ తరహా రుణాల్లో భాగంగా యూనిట్ల గ్రౌండింగ్ కోసం 3 ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని బ్యాంకర్లను కోరారు. 

అడ్వాన్డ్స్​ట్రైనింగ్ సెంటర్లలో ప్రవేశాలకు అనుమతి..

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ కేంద్రాల్లో ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్​లో సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదికి నల్గొండ  బాయ్స్(ఐటీఐ), అనుముల, డిండి అడ్వాన్డ్స్ టెక్నాలజీ కేంద్రాలకు అనుమతి వచ్చిందన్నారు.

ఈ కళాశాలల్లో త్వరలో వృత్తి విద్య కోర్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలోని యువత ఈనెల 30లోపు ఆయా కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎఫ్ వో రాజశేఖర్, ఎల్ డీఎం శ్రామిక్, ఆర్బీఐ ఏజీఎం పృథ్వీ, నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, ఏపీజీవీబీ ఏజీఎం విజయభాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.