ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చేవారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ బృందాలతో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సమన్వయం చేసుకొని ఎక్కువ దరఖాస్తులు పరిష్కరించేలా చూడాలన్నారు.

 ఓటరు జాబితా మెర్జింగ్, మ్యాపింగ్ ను సెప్టెంబర్ ఒకటి నాటికి టీపోల్ పోర్టల్ లో నమోదు చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 3 నాటికి మాన్యువల్ పరిశీలన సైతం పూర్తిచేయాలన్నారు. ఫిబ్రవరి 9 నుంచి ఇప్పటివరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల వివరాలు సేకరించాలన్నారు. సెప్టెంబర్ 15 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను తనకు అందించాలని ఆదేశించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని దేవరకొండ, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్టీ

పీవో ఇంజినీర్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా వైద్యాధికారి  శ్రీనివాస్, జిల్లా సంక్షేమశాఖ అధికారి సక్కుబాయి, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ ఏఈలు పాల్గొన్నారు.