- కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : చదువుకుంటేనే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. నల్గొండలోని బోయవాడ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. కిందటి నెలలో స్కూల్‌ను సందర్శించినప్పుడు పలు సమస్యలను గుర్తించామని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఆదేశాలిచ్చామని తెలిపారు. కాగా ఆ అపనుల పురోగతిని శనివారం ఆయన పరిశీలించారు.
మధ్యాహ్న భోజనం సమయంలో పాఠశాలకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. భోజనం గురించి ఆరా తీశారు. గతంలో కంటే ఇప్పుడు భోజనం బాగా పెడుతున్నారని విద్యార్థులుచెప్పారు. పాఠశాలలో రిపేర్లు పూర్తయ్యాయని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.