భోజనం తగ్గిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ సి.నారాయణరెడ్డి  

భోజనం తగ్గిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ సి.నారాయణరెడ్డి  
  • కలెక్టర్ సి.నారాయణరెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని బోయవాడ పట్టణ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి 6, 7 వ తరగతి  విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, అల్పాహారం, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారాన్ని తక్కువగా ఇస్తున్నారని, దోమల సమస్య, దుప్పట్ల కొరత ఉందని,  ప్రత్యేకించి నోట్ బుక్కులు, యూనిఫామ్స్​కావాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరారు.

దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మెనూ ప్రకారం కాకుండా తగ్గించి భోజనం పెట్టినట్లయితే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు కోరిన వాటన్నింటినీ పది రోజుల్లో ఏర్పాటు చేస్తానని తెలిపారు. కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈవో అరుంధతి, ఇన్​చార్జి స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.