ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: తరుగు, కడ్తా పేరుతో రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​ హాల్​ లో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, సీఈఓలు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఖరీఫ్​లో సాగు చేసిన రైతు ఏ దశలోనూ ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరించాలని అన్నారు. గతేడాది 3 .90 లక్షల ఎకరాల్లో వరి పండించగా, ఈసారి 4 . 18 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగినందున అధికంగా దిగుబడులు వస్తాయని చెప్పారు. క్వింటాలుకు రూ.1900 వరకు ధర ఉంటుందన్నారు.  తమకు తెలియకుండానే కడ్తా పెట్టారంటూ ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్ ఓ చంద్రప్రకాశ్, డీసీఓ సింహాచలం, డీఏఓ తిరుమల ప్రసాద్, డీటీసీ వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలే

నిజామాబాద్ క్రైమ్, వెలుగు ; దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ అదే పనిగా దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సీపీ నాగరాజు వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం స్థానిక బోధన్ బస్టాండ్ దగ్గర వెహికల్స్​ తనిఖీ చేస్తుండగా నెంబర్ ప్లేట్ లేకుండా బైక్​పై ఆకుల్ వార్ రాజేందర్ (40) ను ఒకటో టౌన్ పోలీసులు అరెస్టు చేసి, వివరాలు ఆరా తీశారు. బైక్​లను దొంగతనాలు చేసి ఎవరికి అనుమానం రాకుండా మహారాష్ట్రకు తరలించి వాటిని అమ్మిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఇటీవల నిజామాబాద్, హైదరాబాద్ పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. అతని నుంచి నాలుగు లక్షల 90 వేల విలువ ఏడు వెహికల్స్​ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయబాబు, వన్ టౌన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి 

ఆర్మూర్, వెలుగు : ఆలూరు మండల కేంద్రంలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఆలూరు కు చెందిన కుమ్మరి పడగెల గంగారం(65), గంగామణి (57)లు చనిపోయి ఉండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ ప్రభాకర్ నేతృత్వంలో సీఐ సురేష్​బాబు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పంచనామాకు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా భార్య భర్తలు తరుచు గొడవపడేవారని తెలుస్తోంది. కాగా తమ కొడుకు మృతి చెందడంతో ఆరేండ్ల కిందట బోధన్​ కు చెందిన యువకున్ని తెచ్చుకుని వృద్ధ దంపతులు తమ పెంపుడు కొడుకుగా పెంచుకుంటున్నారు. అర్ధరాత్రి తర్వాత ఇద్దరు చనిపోయి ఉన్నారని ఆ మైనర్ బాలుడు పోలీసులకు వివరించాడు. అనుమానాస్పద కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీఐ సురేష్​ బాబు తెలిపారు. 

సూజాతకు అబ్దుల్​కలాం నేషనల్​ అచీవ్​మెంట్​​అవార్డు

బోధన్, వెలుగు : వికలాంగుల సంక్షేమం కోసం 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుకు ఎంపికైంది. ఈనెల 18న న్యూఢిల్లీలోని జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ఆమె అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పోరాటాలు, కౌన్సిలింగ్ కు గుర్తింపు దక్కిందని, జాతీయస్థాయిలో ఈఅవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి 

ఆర్మూర్, వెలుగు : ఆలూరు మండల కేంద్రంలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఆలూరు కు చెందిన కుమ్మరి పడగెల గంగారం(65), గంగామణి (57)లు చనిపోయి ఉండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ ప్రభాకర్ నేతృత్వంలో సీఐ సురేష్​బాబు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పంచనామాకు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా భార్య భర్తలు తరుచు గొడవపడేవారని తెలుస్తోంది. కాగా తమ కొడుకు మృతి చెందడంతో ఆరేండ్ల కిందట బోధన్​ కు చెందిన యువకున్ని తెచ్చుకుని వృద్ధ దంపతులు తమ పెంపుడు కొడుకుగా పెంచుకుంటున్నారు. అర్ధరాత్రి తర్వాత ఇద్దరు చనిపోయి ఉన్నారని ఆ మైనర్ బాలుడు పోలీసులకు వివరించాడు. అనుమానాస్పద కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీఐ సురేష్​ బాబు తెలిపారు. 

రేషన్​ బియ్యం పట్టుకున్న పోలీసులు

భిక్కనూరు, వెలుగు : మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలోని బాలజీ రైస్​మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని ఎస్సై ఆనంద్​ గౌడ్​ మంగళవారం పట్టుకున్నారు. సుమారు 86 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, సివిల్​ సప్లయ్​ అధికారులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. 

షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి

బోధన్, వెలుగు : ఈనెల 16నుంచి బోధన్​ నియోజవర్గంలో వైఎస్​ఆర్​టీపీ అధినేత షర్మిల పాదయాత్ర ఉంటుందని బోధన్​ నియోజవర్గ కోఆర్డినేటర్​ గౌతంప్రసాద్​ తెలిపారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని మంగళవారం బోధన్​ ఏసీపీ కిరణ్​కుమార్​కు, పట్టణ సీఐ ప్రేమ్​కుమార్​కు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో నాయకులు జి.జగన్​, సయ్యద్​, యూనుస్​, చెన్నారెడ్డి పాల్గోన్నారు. 

బూత్​ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార

పిట్లం, వెలుగు : జుక్కల్​ నియోజకవర్గంలో బీజేపీని బూత్​ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు అరుణతార సూచించారు. బిచ్కుందలో ఆమె అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూత్​ లెవల్​ మీటింగ్​ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసినపుడే నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోగలుగుతామని అన్నారు. టీఆర్​ఎస్​ ప్రజావ్యతిరేక పాలను తిప్పికొట్టాలని, ఆ పార్టీ వైఫల్యాను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండాయప్ప మఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య, బిచ్కుంద ఇన్​చార్జి కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మైనార్జీ మోర్చా నాయకులు సైఫుల్లాఖాన్​, జిల్లా సెక్రెటరీలు కాలకుంట్ల రాము, తేలు శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు. 

రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బీబీపేట గర్ల్స్​ హైస్కూల్​లో పొగ్రాం నిర్వహించారు. స్టూడెంట్స్​కు శానీటరీ న్యాప్​కిన్స్​, నోటుబుక్స్​, పెన్నులు, శానిటైజర్లు అందజేశారు. క్లబ్​ ప్రెసిడెంట్​ సిరిగాధ లక్ష్మీ నర్సింహులు, సెక్రెటరీ పి.సత్యం, ప్రతినిధులు శ్రీశైలం, గంగారెడ్డి, అయిత బాల్​కిషన్​ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఆవులకు లంపి స్కిన్​ 

జిల్లాలో ఏడు పశువులకు వ్యాధి గుర్తింపు
5వేల ఆవులకు వ్యాక్సిన్​ 

నిజామాబాద్, వెలుగు :
జిల్లాలోని ఆవులకు లంపి స్కిన్​ వ్యాధి  సోకుతోంది.  గడిచిన 48 గంటల్లో 7 ఆవులకు అధికారులు ఈ వ్యాధిని గుర్తించారు. నందిపేట, రెంజల్​, నవీపేట మండలాల్లో ఈ వ్యాధి బయటపడగా.. నవీపేట, డిచ్​ పల్లి, మాక్లూర్​, వర్ని చందూరు మండలాల్లో చాలా పశువులకు ఈ లక్షణాలు కనిపిస్తున్నట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు వస్తాయి. ఆవు పూర్తిగా బలహీనపడుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన ఆవులను వెంటనే వేరు చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి తెల్లజాతి ఆవుల్లో వేగంగా విస్తరిస్తోంది. దీన్ని నివారించేందుకు పశువైద్యాధికారు వ్యాక్సిన్ ఇస్తున్నారు. జిల్లాలో 40 వేలకు పైగా తెల్లజాతి పశువుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ - ఇప్పటి వరకు దాదాపు 5 వేల పశువులకు వ్యాక్సినేషన్​ చేశారు. 

బార్డర్​ చెక్ పోస్ట్​ ల్లో తనిఖీలు నిల్​ ..
సరిహద్దు మహారాష్ట్ర నాందేడ్​ నుంచి స్థానిక సాటాపూర్​ మార్కెట్​కు బోధన్ సాలూరా, కందకుర్తి మీదుగా , కర్ణాటక లోని ఔరద్​ , బీదర్​ నుంచి మాసాయిపేట్, సలాబత్​పూర్, జుక్కల్​ నుండి పశువులు తరలిస్తారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద పశువుల మార్కెట్​ పేరున్న సాటాపూర్​ అంగడిలో ప్రతిశనివారం సుమారు 10 వేల వరకు పశువులు వస్తాయి. ఈ మార్కెట్​ నుంచి లంపిస్కిన్​ ఎక్కువ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానిక రైతులు అంటున్నారు. జిల్లాలోని పలుచోట్ల పశువుల మార్కెట్​ లను బంద్​ చేయాలని కోరుతున్నారు. లంపి స్కిన్ వ్యాధి వ్యాపించకుండా చర్యలు చేపట్టాం అని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్​ జగన్నాథచారి తెలిపారు. వ్యాధి సోకిన పశువులకు గోట్ ఫాక్స్ వ్యాక్సిన్​ వేశామని, దీంతోపాటు మరో 5 వేల పశువులకు వ్యాక్సినేషన్​ వేవామని పేర్కొన్నారు. ‘అలాగే పాడి రైతులకు బంపి స్కిన్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నాం. పాడి రైతుల జాగ్రత్త లు తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది’ అని ఆయ చెప్పారు. 

దొంగలు అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్ : నిజామాబాద్ లో చైన్ స్నాచింగ్​తో పాటు పలు దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలను నాలుగో టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్ వివరాల ప్రకారం. అక్టోబర్ 1న ఫులాంగ్ జంక్షన్ లోని సిటీ యూనియన్ బ్యాంక్ లో ఓ వ్యక్తి రూ. 49వేలు విత్ డ్రా చేసుకొని ప్రగతి నగర్ లోని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకవైపు నుంచి బైక్​ పై వచ్చిన ఆటో నగర్ కు చెందిన షేక్ నేహాల్, శాంతినగర్ కు చెందిన సోఫీ హైమద్ అతని జేబులో ఉన్న నగదును ఎత్తుకుపోయారు. నాలుగో టౌన్ ఎస్ఐ సందీప్ తన సిబ్బందితో మంగళవారం పులాంగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వెహికల్ ని పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా పారిపోతున్న వారిని పట్టుకొని విచారించారు. దొంగతనాలు ఒప్పుకోవడంతో పాటు వారి నుంచి 48 వేల  500 రూపాయలు నగదు, పల్సర్ బైకు, రెండు మొబైల్ ఫోన్లు స్వాదీన పరచుకుని రిమాండ్ కు తరలించారు. 

కబ్జాలు ఆపాలని వినతి

నవీపేట్, వెలుగు : మండల కేంద్రంలో ని సొసైటీ ఆవరణ అనుకోని నిర్మాణం లో ఉన్న   కబ్జాను ఆపాలని ఎంపీడీఓ గోపాలకృష్ణ కు సొసైటీ డైరెక్టర్ లు వినతిపత్రం అందజేశారు. అనంతరం డైరెక్టర్ లు మాట్లాడుతూ బాలుర పాఠశాల విద్యాశాఖ ఆఫీస్ సొసైటీ అనుకోని అక్రమ నిర్మాణం చేపడుతున్నారు అని పలు మార్లు ఇరిగేషన్ ఏఈ, జీపీ సెక్రటరీ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే నిర్మాణం అపకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని అన్నారు.ఫిర్యాదు చేసిన వారిలో సొసైటీ డైరెక్టర్ లు రాము, గణేష్, బాల గంగాధర్, కాంగ్రెస్ లీడర్ వడ్డే రవి ఉన్నారు.

షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి

బోధన్, వెలుగు : ఈనెల 16నుంచి బోధన్​ నియోజవర్గంలో వైఎస్​ఆర్​టీపీ అధినేత షర్మిల పాదయాత్ర ఉంటుందని బోధన్​ నియోజవర్గ కోఆర్డినేటర్​ గౌతంప్రసాద్​ తెలిపారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని మంగళవారం బోధన్​ ఏసీపీ కిరణ్​కుమార్​కు, పట్టణ సీఐ ప్రేమ్​కుమార్​కు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో నాయకులు జి.జగన్​, సయ్యద్​, యూనుస్​, చెన్నారెడ్డి పాల్గోన్నారు. 

కొత్త కార్యవర్గం ఎంపిక

పిట్లం, వెలుగు: పిట్లం మండలం ఆర్​ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్​ కొత్త కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా వైస్​ ప్రసిడెంట్​ కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో మండల ప్రెసిడెంట్​గా బోయిని రాములు, జనరల్​ సెక్రెటరీగా జనార్ధన్​, వైస్​ ప్రసిడెంట్​గా సాయిలు, కోశాధికారిగా వెంకటరమణాగౌడ్​, సహ కార్యదర్శిగా రఘు ఎన్నికయ్యారు. 

విద్యార్థుల ర్యాలీ

పిట్లం, వెలుగు : ప్రపంచ ఆహార దినోత్సవ ం సందర్భంగా పిట్లంలో మంగళవారం స్టూడెంట్స్​ ఆహార భద్రత చట్టం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్మోహన్​రావు​ ప్రపంచ ఆహార దినోత్సవంపై స్టూడెంట్స్​కు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవిసింగ్​, ఇన్​చార్జి హెడ్మాస్టర్​ గణేశ్​రావు, టీచర్లు పాల్గొన్నారు.

గెలుపోటములు సమానంగా తీసుకోవాలి

కామారెడ్డి, వెలుగు : ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని కామారెడ్డి అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా ఖోఖో పోటీలు నిర్వహించారు. స్టేట్​ లేవల్​ పోటీల్లో పాల్గొనే మహిళ, పురుషుల జట్ల సెలక్షన్​ కోసం ఈ పోటీలు జరిగాయి. అడిషనల్​ కలెక్టర్​ చీప్​గెస్ట్​గా వచ్చి, విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి వైస్​ ఎంపీపీ ఉరుదొండ నరేశ్​, టోర్నమెంట్​ కన్వీనర్​ నీల లింగం, అథ్లెటిక్స్​ అసోసియేషన్​ జిల్లా ప్రెసిడెంట్​ జైపాల్​రెడ్డి, ఖోఖో అసోసియేషన్​ ఛైర్మన్​ అనిల్​ పాల్గొన్నారు. 
 

సామాజిక సేవలో  అందరూ భాగస్వాములు కావాలి

కామారెడ్డి, వెలుగు : కెనరా బ్యాంక్​ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా లైబ్రరీకి రూ.3.28 లక్షల ఫర్నిచర్​ను కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన సేవలు అందించటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావటం అభినందనీయమన్నారు. లైబ్రరీలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, విద్యార్థులు, స్థానికులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్​ పర్సన్​ నిట్టు జాహ్నవి, కెనరా బ్యాంక్​ రీజినల్​ హెడ్​ శ్రీనివాస్​రావు, ఎల్టీఎం రమేశ్​ పాల్గొన్నారు. 

లైబ్రరీ ప్రారంభం.. 

పిట్లం : మంగళవారం జుక్కల్​ మండలం కౌలాస్​ గ్రామంలో రూర్బన్​ స్కీంలో నిర్మించిన లైబ్రరీని జిల్లా కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడారు. రూర్బన్​ స్కీంలో నిర్మించిన లైబ్రరీలో పుస్తకాలు, ఫర్నీచర్​ను అందించిన కామారెడ్డి కెనరా బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మెంబర్​ మాధవరావు, బ్యాంకు సిబ్బంది గ్రామపెద్దలు పాల్గొన్నారు.
 

పట్టుదలతో చదివితే విజయం

సిరికొండ, వెలుగు: కృషి, పట్టుదలతో చదివితే విజయం సొంతమవుతుందని సత్యశోధక్​ ఎడ్యుకేషనల్​ సొసైటీ చైర్మన్​ రావుట్ల నర్సయ్య అన్నారు. బాసర ట్రిపుల్​ ఐటీకి ఎంపికైన కె.అమూల్యను మంగళవారం సన్మానించారు. స్కూల్​ స్థాయిని నుంచే స్టూడెంట్లు లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. కార్యక్రమంలో టీచర్లు గంగారెడ్డి,శంకర్​,లింగం,రాజు, రవి ఉన్నారు.

12 సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ
లింగంపేట,వెలుగు :
మండలంలోని పర్మల్ల మాలోత్​ తండాలో 12 సీసీ కెమెరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్​ఐ శంకర్​ మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దొంగలను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని  చెప్పారు. తండాలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన సర్పంచ్​ సునీతను డీఎస్పీ, సీఐలు అభినందించారు.