జనగామ అర్బన్, వెలుగు : ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ పూర్తయిందని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య చెప్పారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌లో ఉన్న మిషన్లను అడిషనల్ కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు.
1,366 బ్యాలెట్ యూనిట్లు, 1122 కంట్రోల్ యూనిట్లు, 1,297 వీవీ ప్యాట్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావెల రవి, విజయ్‌భాస్కర్, సీహెచ్. శ్రీనివాస్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్, అజయ్, జోగు ప్రకాశ్ పాల్గొన్నారు.